telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 3:30 pm Posted by : TELANGANA KERATAM

ఏసీబీ వలలో నర్సాపూర్ ఏడిఈ 

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో మే 

:మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడిఈ రమణ రెడ్డి 25వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి విషయంలో రైతు వద్ద లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏసీబీ అధికారులు విద్యుత్ కార్యాలయం పై దాడులు నిర్వహించి ఏడిఈ రమణారెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని తెలిపారు.