నిర్దోషిగా తేల్చడాన్ని సవాలు చేసిన ఈడీ తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో దాఖలైన కేసుల్లో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది....