
సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్
ఏప్రిల్ 6 న (సోమవారం ) Citu ఆధ్వర్యంలో కలెక్టర్కు గ్రామ సేవకుల మెమోరండం
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 4
జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు
గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని
రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు