తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7: జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారిని పక్కాగా ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణం ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి నుండి ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియను యాప్ ద్వారా చేస్తామన్నారు. ఈ ప్రక్రియ...