ప్రజాస్వామ్యం అంటే ‘ప్రశ్నించే హక్కు’.. శిక్షలు కేవలం ప్రజలకేనా?

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

పాలకులకు లేని నిబంధనలు.. పౌరులకు మాత్రం సంకెళ్లా? ​భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ నేడు ఒక సంధి కాలంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శిస్తేనో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో చట్టపరమైన చర్యలు, అరెస్టులు వెనువెంతనే జరిగిపోతున్నాయి. కానీ, అదే రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు, ఎన్నికల వేళ రాజకీయ నేతలు గుప్పించిన 'తప్పుడు వాగ్దానాల' మాటేమిటి? ప్రభుత్వాలపై విమర్శలు చేసేవారిని దోషులుగా నిలబెట్టే చట్టాలు ఉన్నప్పుడు.. అబద్ధపు హామీలతో ప్రజలను వంచించే పాలకులపై చర్యలు తీసుకునే చట్టాల...