telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 8:09 pm Posted by : TELANGANA KERATAM

 ప్రజా గొంతుక హరీష్ రావు  నిర్బంధించడం అప్రజా స్వామీకం!

ప్రభుత్వ ముసుగులో ప్రజల ఆస్తులను దండుకుంటున్న రేవంత్ రెడ్డి ముఠా పాలెం! మాజీ మంత్రి హరీష్ రావు గా ప్రజల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులా! హరీష్ రావు  అరెస్టును మండల బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం!  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు భూ దందాల ప్రభుత్వం!

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి చిన్నకోడూరు

ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అరెస్టు చేయడాన్ని మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ అన్నారు చిన్నకోడూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజాకంటక ప్రభుత్వంగా మార్చాడని ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ యదేచ్ఛగా ప్రజల ఆస్తులను అమ్ముతున్నాడని మండిపడ్డారు.ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న హరీష్ రావు గారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధించి గొంతు నొక్కాలని చూస్తున్నారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న హరీష్ రావు గారిని నిర్బంధాలు కేసులు నిలువరించలేవని అన్నారు.తెలంగాణ ప్రజలకు రైతులకు అనుకూలంగా నూతనంగా మార్కెట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా మార్కెట్ భూములను చెరువుకుంటలా సికం భూములను కబ్జాలు చేస్తూ అమ్ముకోవడం అత్యంత దారుణమని ఇలాంటి భూ బకాసుర ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని ఇక చూడబోమని అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మొదటిది చివరిదని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ములకల కనకరాజు, కీసరి పాపయ్య, కాముని ఉమేష్ చంద్ర, కొండం రవీందర్ రెడ్డి, కాల్వ ఏల్లయ్య, పంపరి కనకయ్య, రాజశేఖర్ రెడ్డి, బాబు తదితరులు ఉన్నారు