తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో
ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్‌స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు.
ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్‌స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ సర్కార్ తమను రోడ్డుపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. భూములు లాక్కుంటే చావే శరణ్యమని స్పష్టంచేశారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకున్న కొద్దిపాటి భూమిని లాక్కుంటే తమ కుటుంబాలు వీధిన పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.