telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 6:48 pm Posted by : TELANGANA KERATAM

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని

అన్నారం గ్రామ సర్పంచ్ చింతకింది లత శ్రీనివాస్ ఉప సర్పంచ్ మద్దికుంట దయానంద్ గ్రామపంచాయతీ కార్యదర్శులు లింగాల సాగర్ గౌడ్ కొనియాడారు 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14

రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు పూలమాలలు వేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం భారతీయులకు గర్వకారణమని పేర్కొన్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతకింది లత శ్రీనివాస్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశాడని తెలిపారు.చిన్న వయసులోనే కుల వివక్షతను ఎదుర్కొన్న అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలన తోనే వివక్ష అంతమై ఆత్మ గౌరవంతో జీవిస్తారని అన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించారు అన్నారు
. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మాజీ ఎంపీటీసీ గడ్డం చిన్న గంగారెడ్డి మంగళారపు జీవన్ కూడలి ఎల్లం వీరబోయిన రాజేందర్ మోత్కుల సాయిరాం గౌడ్ కూడలి స్వామి చాట్ల లక్ష్మణ్ సుద్దాల రాజు దేవుపల్లి రాజేందర్ తలారి మోహన్ మోత్కుల సతీష్ కుమార్ గౌడ్ మండ్ల బాల్ నర్స్ పంగ రాజు సుద్దాల రమేష్ తలారి విజయ్ కుమార్ సుద్దాల స్వామి కూడలి లక్ష్మణ్ నర్మల సురేష్ తలారి రాజు కూడలి సురేష్ ఈరబోయిన రాజేందర్ కీసరి స్వామి కూడలి దేవరాజు కూడలి బాబు సుద్దాల రాజేష్ పొక్కిలి మహేందర్ కీసరి సంతోష్ కుమార్ కీసరి ప్రవీణ్ కీసరి స్వతిక్ పొక్కిలి గంగరాజు సుద్దాల సత్యం తదితరులు పాల్గొన్నారు.