మండుటెండలోనూ వైభవంగా మాకుల పారువేట

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

తెలంగాణ కెరటం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్  మండుటెండలను సైతం లెక్కచేయకుండా భక్తి ప్రవాహంగా మారిన పారువేట ఉత్సవం మరోసారి మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితాన్ని చాటిచెప్పింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ ఉత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహం, సంప్రదాయ వైభవం, ప్రజా భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం ఆలయ ప్రాంగణాన్ని కిక్కిరిసేలా చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభ బండ్లు, వాహనాలపై కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో తమ...