telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 2:28 pm Posted by : TELANGANA KERATAM

మత్తులో జోగుతున్న యువత- కన్నవారికి కడుపుకోత

గ్రామాల్లో బెల్టుషాపుల జోరు.. కుటుంబాల్లో కలహాలు?

మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవలు 

నిద్రమత్తులో అధికారులు

తెలంగాణ కెరటం రామారెడ్డి మండల ప్రతినిధి 

నేటి యువతే దేశానికి వెన్నెముఖ అన్న నానూడి బెల్టు షాపుల మద్యం మహమ్మారికి బానిసై కన్నవారికి కడుపు కోతను మిగులుస్తుందా అని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చని పొలాలతో వెలుగొందాల్సిన వల్లెలు బెల్టుషాపుల మద్యం మహమ్మారి పుణ్యమా అని యువత మత్తులో జోగుతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు తరుచు గొడవలతో ప్రశాంతత చెదిరిపోతుంది. పచ్చగా ఉండాల్సిన సంసారాలు కుప్పకూలిపోతున్నాయి. వదుల వయస్సు కలిగిన యువకులు మద్యంకు బానిసలై తమ భావి జీవితానికి వారే ముళ్లబాటలను వేసుకుంటున్నారు. గ్రామాల్లో నిత్యావసర సరుకులు దొరికే కిరాణషాపులు సరిగాలేని పల్లెల్లో సైతం మద్యం బెల్టు షావుకేంద్రాలు విరాజిల్లుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

గ్రామాల్లో జాతరలు నిర్వహిస్తే మద్యంతో పాటు గుడుంబా అమ్మేందుకు కూడా బెల్టుషాపులు వేలం పాటలు నిర్వహిస్తున్నారంటే అమ్మకాలు ఎంత జోరుగా, బహిరంగంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. బెల్టుషాపుల యాజమాన్యాలతో అధికారులు కుమ్మకై గ్రామల్లో బెల్టు షాపులలో మద్యం భారీఎత్తున అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసారా చేసుకుంటున్న వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీలు, స్వచ్చంద సంస్థలు నిబంధనల మేరకు మద్యాన్ని అమ్మావద్దని ఉద్యమాలు నిర్వహించినా వ్యాపారస్తుల్లో కనీసం ఇంతకూడా చలనం రాకపోవడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సామాన్యజనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 60నుడి 70 వరకు మద్యం అమ్మకం కేంద్రాలున్నాయి. ద్విచక్రవాహనాలపై వివిధ ప్రాంతాల నుంచి తరలించి మండలంలోని విక్రయకేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. చిన్నతనంలోనే మద్యంబానిసలవుతున్నారు. 40సంవత్సరాల వయసు కలిగిన వారే అధికంగా ఉన్నట్లు తెలియవస్తుంది.

కుటుంబాల్లో కలహాలు రేపుతున్న వైనం..:

మద్యంకు బానిసలైన వారు నిత్యం ఇంట్లో గొడవలు చేస్తుండడంతో వారి సంసారాల్లో కలహాలు రేగుతున్నాయి. పెళ్లి జరిగి సంవత్సరం కూడా దాటక ముందే మద్యం మహమ్మారి పుణ్యమా అని విడాకుల వరకు దారి తీస్తున్నాయి. అంతే కాకుండా యుక్తవయస్సుల్లోనే మద్యంకు బానిసలై మరణిస్తుంటే వారి భార్యలు వైధవ్యాలు పొందుతూ చేసుకుంటున్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు చాలా మంది మృత్యువాత వడ్డారు. మరికొంత మందికి అనారోగ్యం పాలై చావుకు దగ్గరలో ఉన్నారు.