ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 12 మంది సజీవ దహనం కావడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర...