telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:10 pm Posted by : TELANGANA KERATAM

ముదిరాజ్ చైతన్య వేదిక. ఉస్మానియా విశ్వవిద్యాలయం.

ముదిరాజ్ చైతన్య వేదికను విజయవంతం చేయాలి. 

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ, ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని ముదిరాజ్ చైతన్య వేదిక తీవ్రంగా విమర్శించింది. ముదిరాజ్ వర్గ హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం “హల్లో ముదిరాజ్ ఛలో గాంధీ భవన్ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.ఈ కార్యక్రమానికి సంబంధించి ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ యువత, నాయకులు, బీసీ, బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తేదీ: ఏప్రిల్ 10 సమయం: ఉదయం 11 గంటలకు స్థలం: గాంధీ భవన్, హైదరాబాద్ ప్రధాన డిమాండ్లు కోకాపేట్ భూమిపై ఉన్న ట్రస్ట్‌ను రద్దు చేసి ముదిరాజ్ జాతికి అంకితం చేయాలి.మత్స్యశాఖ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి.సంబంధిత ప్రజాప్రతినిధులపై ఉన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో ఇతర బీసీ, బహుజన సంఘాలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని, ముదిరాజ్ హక్కుల కోసం ఇది కీలక పోరాటమని వేదిక పేర్కొంది.