యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి ఏప్రిల్12 కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ వివాహ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దౌల్తాబాద్ లోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రాకతో పెళ్లి వేడుకలో ఉత్సాహం మరింత పెరిగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.