telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 4:22 pm Posted by : TELANGANA KERATAM

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ కాలంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు సరైన ధరలు, సకాలంలో కొనుగోలు, మార్కెట్ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రైతు బతుకుదెరువు మాత్రమే కాదు, అతని ఆర్థిక స్థితి మెరుగుపడేలా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. పంటల కొనుగోలు సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ కమిటీలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు గోదాములు, తూకం యంత్రాలు, రవాణా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయడం, మద్దతు ధరలు రైతులకు లాభదాయకంగా ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతు ఉత్పత్తికి సరైన విలువ దక్కేలా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు.

రైతు బాంధవుడు, రైతు సమస్యలు ఎరిగిన వాడు.. రైతు కష్టాలను దగ్గరుండా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబందించిన పంట రుణాలను అది కూడా ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేసి రైతు బాంధవుడిగా మారిన నాయకుడు రేవంత్‌రెడ్డి ఒక్కరేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను, ఉత్సాహవంతులైన యువతను ప్రోత్సహించడం, వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ బాధ్యతలలో సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన విధానమనీ, ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.