telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 7:22 am Posted by : TELANGANA KERATAM

రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు పై అవగాహన

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి 

దౌల్తాబాద్ మండలం గోకాఫసల్ వాద్ గ్రామంలో ఫైనియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ లో ట్రాఫిక్ నియమాలు హెల్మెట్ అతివేగం జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో తమ అమ్మానాన్నలకు ఉత్తరం ద్వారా నియమాలను రాయించి చదివించాలని కోరడం జరిగింది
నేను తమరితో తెలియజేయునది ఏమనగా ఈరోజు నుంచి నీవు హెల్మెట్ లేకుండా బైక్ ని నడపకూడదు. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని తోలరాదు. ఇప్పటినుండి నీవు హెల్మెట్ లేకుండా లేదా మద్యం సేవించి వాహనం నడిపినట్టు అయితే నేను మరి నాతో పాటు మన కుటుంబ సభ్యులము ఎవరు కూడా మీ యొక్క వాహనాన్ని ఎక్కము. అలాగే నీ నుండి ఎదురుగా వచ్చే ఇతర వాహనాలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటానని నాకు ప్రమాణం చేయాలి. నీవు ఎప్పుడూ బయటికి వెళ్లిన క్షేమంగా ఇంటికి వస్తావని మన కుటుంబ సభ్యులందరము ఎదురు చూస్తూ ఉంటాము. నేను మరియు మన కుటుంబ సభ్యులందరము నీకు ఇష్టమున్నట్టయితే నేను చెప్పిన విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాన్ని నియంత్రణతో నడిపి క్షేమంగా ఇంటికి వస్తావని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాలల యజమాన్యం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.