రాయపోల్లో భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనం. రైస్ మిల్పై ఆకస్మిక దాడి. తెలంగాణ కెరటం సిద్దిపేట్ క్రైమ్ బ్యూరో ఏప్రిల్ 10 విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం సివిల్ సప్లైస్ అధికారులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీమ్–2 సంయుక్తంగా రాయపోల్ మండల పరిధిలోని రామారం గ్రామంలో ఉ న్న శ్రీ సాయి మహాదేవ రైస్ మిల్లుపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సుమారు 1100 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఒక వాహనం రైస్ మిల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగా అదుపులోకి తీసుకుని, అందులో ఉన్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. విచారణలో డ్రైవర్ తెలిపిన ప్రకారం, ఈ బియ్యం బచ్చు రత్నాకర్కు సంబంధించినదిగా, అమ్మకానికి ఈ రైస్ మిల్కు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. డ్రైవర్ ద్వారా రైస్ మిల్లర్ను ఫోన్లో సంప్రదించగా, అతని గుర్తింపు బచ్చు రత్నాకర్గా నిర్ధారించబడింది. అయితే పలుమార్లు ఫోన్ కాల్స్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత రైస్ మిల్లర్పై గతంలో కూడా పీడీఎస్ బియ్యం మళ్లింపు కేసులు మరియు ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. ఇలాంటి అక్రమాల నేపథ్యంలో ఈ రైస్ మిలు గతంలోనే ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ కార్యకలాపాల నుంచి బ్లాక్ లిస్ట్ చేసినట్లు వెల్లడించారు. పంచనామా ప్రకారం స్వాధీనం చేసుకున్న 1100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని భద్రపరిచేందుకు తొగుట, మిరుదొడ్డి ఎంఎల్ఎస్ పాయింట్లకు అప్పగించారు.ఈ ఘటన పై రాయపోల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు, ఏస్సెంటిల్ కామడిటీస్ ూష్, 1955 కింద 6. కేసు నమోదు చేశారు. అదేవిధంగా తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2016 మరియు తెలంగాణ కస్టమ్ మిల్లింగ్ ఆర్డర్ 2015 ఉల్లంఘనలకు సంబంధించిన చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది అని తెలిపారు