తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఏప్రిల్
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డిఎల్ పాండు ముదిరాజ్ మొదటిసారిగా సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ పెద్దమ్మ దేవస్థానం ఆవరణలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులు పడిగే ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం, పుల్లూరు సుధాకర్, సుతారి రాజు, ముదిరాజ్ నాయకులు చింతమడక రాజన్న, తుపాకుల బాల్ రంగం, యామ ధర్మ, పుప్పాల బాలేష్, కొంతం శ్రవణ్, పిట్ల రాజయ్య, అడ్వాకెట్ అరవింద్, నాయిని శేఖర్, సుతారి సత్యనారాయణ సన్మానం చేశారు.ఈ సందర్భంగా డిఎల్ పాండు మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దయవల్ల ముదిరాజుల అందరూ ఐక్యమత్యంగా ఉండి ముదిరాజ్ హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు పరస్పర సహకారంతో ఉద్యమాలు చేయాలని జాతి ఉద్యమాల వల్లనే ఈనాడు నాకు ఈ గౌరవం దక్కిందని గౌరవ తెలంగాణ హైకోర్టులో అన్ని వర్గాల వారు అనేకమంది అడ్వకేట్లు భారీ సంఖ్యలో ఓట్లు వేసి నన్ను బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారని ఈ ఘటం చరిత్రలో మర్చిపోలేనిదని నాకు సహకరించిన వారితో పాటుగా తెలంగాణ ముదిరాజ్ అందరికీ న్యాయ సమస్యలు ఏవి ఉన్నా నేను జాతి కోసం పాటుపడతానని సిద్దిపేట ప్రాంత ముదిరాజులు చూపిన ఈ ప్రేమానురాగాలను ఎన్నటికీ మర్చిపోనని అన్నారు.