🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 10:04 pm Posted by : TELANGANA KERATAM

సిద్దిపేటలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శరత్ పర్యటన

News Image
*సిద్దిపేటలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శరత్ పర్యటన_*

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి

రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కే. శరత్ శనివారం జిల్లాలో పర్యటించి జిల్లా కేంద్రంలోనీ సంతోషిమాత ఆలయం దగ్గరలో జువెనైల్ జస్టిస్ బోర్డును ప్రారంభించారు._

_జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది మరియు కోర్టుపనుల మీద వచ్చే ప్రజల సౌకర్యార్థం మెడికల్ డిస్పెన్సరీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. అనంతరం కోర్టు భవనంలోని మూడో ఫ్లోర్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో జ్యుడీషియల్ అధికారులతో జ్యుడీషియరీ రివ్యూ లో పాల్గొన్నారు.

_హైకోర్టు జడ్జి జస్టిస్ కె శరత్ కు జిల్లా జడ్జి జి. సుదర్శన్, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ లు పూల బోకే అందించి స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం సమర్పించారు._

ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు జడ్జి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవాసాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, అదన్నపు డిసిపి కుషాల్కర్, బార్ అసోసియేషన్ సభ్యులు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, న్యాయశాఖ, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home