కోరుట్ల వాసి డాక్టర్ వేణు మాధవ్‌కు టీ.ఎన్.చతుర్వేది అవార్డు
పేదరికాన్ని అధిగమించి జాతీయ పురస్కారం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన డాక్టర్ ఎం.వేణు మాధవ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డాక్టర్ టీ.ఎన్. చతుర్వేది ఉత్తమ పరిశోధనా వ్యాస పురస్కారం లభించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసిన ఆయన, కుటుంబ పోషణ కోసం హోటల్ కార్మికుడిగా, నిర్మాణ రంగ కూలీగా, పెయింటర్‌గా, చిరు వ్యాపారిగా పనిచేశారు. అయినప్పటికీ చదువుపై ఆసక్తితో తిరిగి విద్యాభ్యాసం కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కోరుట్లలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన, 2004లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో చేరి మూడేళ్లలో పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ఏడో ర్యాంకు సాధించారు. యునిసెఫ్ ఫెలోషిప్‌తో ఎం.ఫిల్, ఐసీఎస్ఎస్ఆర్ ఫెలోషిప్‌తో సీఈఎస్‌ఎస్, హైదరాబాద్‌లో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. నీటి పాలనలో ప్రజల భాగస్వామ్యం, సుస్థిర నీటి నిర్వహణపై ఆయన రచించిన ’క్యాటలైజింగ్ వాటర్గవర్నెన్స్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ ఫర్ సిస్టెనేబుల్ వాటర్ మేనేజ్మెంట్’ అనే పరిశోధనా వ్యాసానికి ఐఐపీఏ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అక్టోబరు 31,న న్యూఢిల్లీలో జరిగిన ఐఐపీఏ 72,వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి, ఐఐపీఏ ఛైర్మన్ డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
విశేషమేమిటంటే, ఒకప్పుడు తాను విద్యనభ్యసించిన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ప్రస్తుతం రిసోర్స్ పర్సన్‌గా వీడియో పాఠాలు బోధిస్తున్నారు. పేదరికాన్ని అధిగమించి విద్యా, పరిశోధనా రంగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆయన ప్రస్థానంపై పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు అభినందనలు తెలిపారు.