🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 10:27 pm Posted by : TELANGANA KERATAM

కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని మహిళ ఆత్మహత్య యత్నం

News Image
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : తమ బంధువులకు కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని ఓ మహిళ ఆత్మహత్య యత్నంకు పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తమ భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం..భీమారం మండలం రాగోజీపేట గ్రామానికి చెందిన బాలసాని జయ (భర్త మల్లేశం) అనే మహిళ తన స్వగ్రామంలో స్వంత బావ అయిన నారాయణ, అతని కుమారుడైన బాలసాని మారుతీలకు తమ స్వంత భూమిని కౌలుకు చేసుకునేందుకు ఇవ్వగా, వారు తనను నమ్మిచి నా యొక్క భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించింది. ఇలా ఎందుకు చేశావు అని అతడిని ప్రశ్నిస్తే.. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించాడని తెలిపింది. అంతేకాకుండ నేను ఎక్కడికి వెళ్లినా అతని రాజకీయ బలం వినియోగించుకొని, నన్ను ఎక్కడ కాకుండా చేస్తున్నాడని తెలిపింది. తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, అతని రాజకీయ బలం ముందు నెగ్గలేక తిరిగి మాపై అనగా నా బిడ్డలు, అల్లుళ్ల మీద తప్పుడు కేసులు పెట్టుకుంటూ.. వాళ్లపై దాడి చేస్తున్నాడని వాపోయింది. వాళ్ళు వెళ్లి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, మా భూమి మాకు తిరిగివ్వు అంటే, నేను ఇవ్వను.. మీకు గజం భూమి కూడా లేదని అంటూ, బెదిరించాడని, నన్ను ఒంటరిగా ఉండటం చూసి నా ఇంట్లో చొరబడినన్ను కొట్టాడని ఆరోపించింది. నేను తిడితే వీడియో రికార్డులను సాక్షాలుగా సృష్టించి, మాపై తప్పుడు కేసులు పెడుతూ మమల్ని, నా కుటుంబం సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగక పోవడంతో, దిక్కుతోచని స్థితిలో మా కుటుంబం సభ్యులకు మారుతీ వల్ల ఎలాంటి ప్రాణపాయం కాకూడదనే ఉద్దేశంతో అతడికి భయపడి, నేను ప్రాణాలతో ఉండకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్యా యత్నంకు పాల్పడ్డానని పేర్కొంది. దేవుడి దయ వల్ల బ్రతికి బయట పడ్డానని, ఇకనైనా దయ తలచి ప్రభుత్వం తమ భూమిపై విచారణ జరిపించి భూమిని తిరిగి ఇప్పించాలని వేడుకుంది. మారుతీ కుటుంబం సభ్యులతో తమకు ప్రాణాపాయం ఉన్నందున తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.
🏠 Home