ఇందిరా గాంధీకి నివాళులర్పించిన భీమారం మండల కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి మల్లేశం ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ . భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయికరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ గారు గరీబి హటావో తో పేదరికాన్ని ఆసమానత్వాన్ని తగ్గించిన మహానేత అని, ఆలీన విధానాన్నే కాదు అణుబాంబు పరీక్షను చేపట్టిన ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తోకల నర్సయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కపెల్లి శంకర్, సర్పంచుల ఫొరం అధ్యక్షులు పుల్లురి ఉమారాణి - దేవయ్య, సర్పంచులు దాసరి గణేష్, బొమ్మెన ప్రశాంత్, ఉపసర్పంచ్ లు బింగి స్వామి, కంచి రమేష్, ప్రధాన కార్యదర్శులు బందెల గంగాధర్, బక్కురి నరేష్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉమ్మడి రవి, మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎండి సయ్యద్, బీసీ సెల్ అద్యక్షుడు ముంజ కిషన్, సోషల్ మీడియా ఇంచార్జ్ భూరం అరుణ్, మార్కెట్ కమిటీ సభ్యులు పల్లి భీమయ్య, సురకంటి రాజారెడ్డి, సెక్రటరీ అంగడి ఆనంద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆవ సాగర్, సర్వనందం సినియర్ నాయకులు ఎండి మగ్బుల్, ప్యాట వెంకటేష్, ప్యాట నరహరి, మల్లేశం, బర్కం శేఖర్, పత్తి గౌడ్, బలసని మారుతి, గుమ్మడి మధు, గుగ్గిల గంగాధర్ తదిరులు పాల్గొన్నారు.