కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతారాణి సస్పెన్షన్

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్
అనుమతి లేకుండా గైర్హాజరు, విధుల నిర్లక్ష్యంపై సూపరింటెండెంట్ పై చర్యలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కారణాలతో కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.సునీతారాణిని తక్షణమే సస్పెండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా, సూపరింటెండెంట్ సునీతా రాణి సంబంధిత సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన, సిబ్బంది పర్యవేక్షణ, రోగులకు నిరంతర వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కలిగిన అధికారి స్వయంగా అనుమతి లేకుండా గైర్హాజరు కావడాన్ని ఉత్తర్వుల్లో తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా, ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు సగం మందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఆసుపత్రి సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడకుండా సెలవులు మంజూరు చేయడం పరిపాలనా నిర్లక్ష్యాన్ని, పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసరమైన వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గుర్తించిన లోపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, చేపట్టనున్న క్రమశిక్షణ చర్యల దృష్ట్యా డాక్టర్ సునీతారాణిని సస్పెన్షన్లో ఉంచారు. క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.