🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:05 am Posted by : TELANGANA KERATAM

ఘనంగా కల్వకుర్తి శ్రీ సత్య సాయి మందిర ప్రథమ వార్షికోత్సవం

News Image
తెలంగాణ కెరటము కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 31
కల్వకుర్తిలో శ్రీ సత్య సాయి మందిరంలో స్వామివారి శతజయంతి వేడుకలొ భాగంగా ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయిశ్వర మహాలింగమునకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ అపూర్వ ఘట్టాన్ని వేద పఠనంతో భక్తులు సాయి కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులకు ఆలయ నిర్వహకులు స్వామివారి పాదుకలను మెమొంటోలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గోపికృష్ణ పిడతల , సత్య సాయి ట్రస్ట్ సెక్రెటరీ హైదరాబాద్ శ్రీ ఎం.వి.ఆర్ శేషసాయి, సత్య సాయి సేవ ట్రస్ట్ మెంబర్ శ్రీ సురేష్ కల్లూరు , సోమ సుందరం, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home