🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:07 am Posted by : TELANGANA KERATAM

ఫోరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన సదస్సు

News Image
ఫోరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన సదస్సు

కేసు తీర్పులో ఫోరెన్సిక్స్ ఆధారం కీలకం

ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రత్న పద్మావతి

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : నేర దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత, అనువర్తనాలపై జగిత్యాల బార్ అసోసియేషన్‌లో శనివారం న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రత్న పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నేరస్థల పరిశీలన, భౌతిక సాక్ష్యాల గుర్తింపు, పరిరక్షణ, చేతిరాత, సంతకాల పరిశీలన, సంతకాల ఫోర్జరీ, పత్రాల ప్రామాణికత, వేలి ముద్రలు, డీఎన్ఏ పరీక్షలు, సైబర్, డిజిటల్ ఫోరెన్సిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వివిధ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్స్ పరీక్షలు ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్‌ల్యాబ్ ఫోరెన్సిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మోహన్ ఎర్రగొల్ల ప్రధాన వక్తగా పాల్గొని వివిధ ఫోరెన్సిక్ అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి డి.నాగేశ్వర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి మట్ట సరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షులు మర్రిపెల్లి సత్యప్రకాశ్, సీనియర్ న్యాయవాదులు రాచకొండ శ్రీరాములు, బండ భాస్కర్ రెడ్డి, మెట్ట మహేందర్, చెందోలి లక్ష్మణ్, ఎనగంటి రామచంద్రం, కరవత్తుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home