🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:46 am Posted by : TELANGANA KERATAM

మనోవికాస్ పాఠశాలలో స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.

News Image
మనోవికాస్ పాఠశాలలో స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు....
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల జిల్లా..
మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సట్ల సంతోష్ గౌడ్ ,తుంగపిండి రాజేష్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ధైర్యసాహసాలతో కూడిన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
గరీబీ హటావో పేదరిక నిర్మూలనను ప్రధాన లక్ష్యంగా తీసుకొని పేద ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు.
బ్యాంకుల జాతీయీకరణ (1969) 14 ప్రధాన ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
హరిత విప్లవం వ్యవసాయ ఉత్పత్తి పెంపునకు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రోత్సాహం అందించారు.
1971 బంగ్లాదేశ్ విముక్తి బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన యుద్ధ సమయంలో భారతదేశానికి నాయకత్వం వహించారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు గోపిశెట్టి వీరన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగపిండి విజయ్, ధనుక్ రాజేష్, కొత్తకొండ రాయమల్లు ,తుంగపిండి రామ్,సూరజ్,అజయ్,కుమ్మం రాజు ,ప్రవీణ్ జూపాక రమేష్,సాంబయ్య ,పి.రమేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home