హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ కమిషనర్ వాణి
హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ కమిషనర్ వాణి రైల్వే వంతెన పనుల పరిశీలన.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ
వంతెన పనులు, నష్టపరిహారం అందేవరకు పోరాటం ఆగదు: అఖిలపక్ష నాయకులు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / అక్టోబర్ 31: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు, భూ బాధితులకు నష్టపరిహారం (టీడీఆర్) అందించే అంశంపై నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కదిలారు. గతంలో అఖిలపక్ష నాయకులకు ఇచ్చిన హామీ మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి సంబంధిత శాఖల అధికారులతో కలిసి రైల్వే వంతెన నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, మున్సిపల్, హెచ్‌ఆర్‌డీసీ శాఖలకు చెందిన అధికారులను వెంటబెట్టుకొని వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న డిప్యూటీ కమిషనర్ వాణి అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. వంతెన నిర్మాణం కారణంగా ప్రభావితమవుతున్న బాధితులకు టీడీఆర్ అందించే విషయంలో ఉన్న సమస్యలు, పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, రైల్వే వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే నష్టపరిహారం విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అఖిలపక్ష నాయకులకు భరోసా కల్పించారు.
బంద్‌కు అఖిలపక్ష నాయకుల పిలుపు
అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఘట్‌కేసర్‌లో రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తికావడంతో పాటు, వంతెన నిర్మాణం వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అధికారులు హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం తలపెట్టిన ఘట్‌కేసర్ పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని పట్టణ ప్రజలకు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు ఘట్‌కేసర్‌లోని లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం భవనం వద్దకు చేరుకొని బంద్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వంతెన నిర్మాణ పనుల జాప్యం, బాధితులకు నష్టపరిహారం అందకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.