పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమే
పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమే
కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య
వెంకటాపూర్ లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల మండల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శనివారం కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్వో కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి సమాన గౌరవం, హక్కులు ఉంటాయని తెలిపారు. పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైనా హక్కులకు భంగం కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి న్యాయం పొందాలని సూచించారు. గ్రామస్థాయిలో సామాజిక సమానత్వం, సోదరభావం, ఐక్యతను పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ ద్యాగ గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కులమత భేదాలు లేకుండా గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ఇతరుల హక్కులకు కూడా భంగం కలగకుండా వ్యవహరించాలని కోరారు. గ్రామంలో అంటరానితనం, వివక్ష వంటి సామాజిక దురాచారాలకు తావులేకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజేందర్ రావు, ఉప సర్పంచ్ పిట్టల రాజేశ్వరి, సెక్రటరీ శ్రీనివాస్, జిపిఓ రమ్యశ్రీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.