కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ముఖ్యమైన పాయింట్స్:కామారెడ్డిలో నిరుపేదలపై జులుం ప్రదర్శిస్తున్న 'వసూల్ రాజా' వ్యవహారం చర్చనీయాశంగా మారింది. అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నట్లు చర్చ జరుగుతోంది.
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో వసూల్ రాజా అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మున్సిపల్ వ్యవహారాల్లోనే కాకుండా పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు చేస్తూ జేబులు నింపుకోవడంతో పాటు క్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దర్జాగా సెటిల్మెంట్లు చేస్తున్నాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో కొందరు మీడియా ప్రతినిధుల సహకారంతో రెచ్చిపోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఫిర్యాదులు ఇప్పించి ఆపై అధికారులు, నాయకులు, మీడియా ప్రతినిధుల పేర్లు చెప్పి లక్షల్లో దండుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చోరీ కేసులో మధ్యవర్తిత్వం.. మీడియాకు మామూళ్లు
కామారెడ్డి రూరల్ సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో వసూల్ రాజా తీరు బట్టబయలైంది. చోరీ కేసులో నిందితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు తీవ్రతను తగ్గించేందుకు, వార్తలు రాకుండా ఉండేందుకు కొంతమంది మీడియా ప్రతినిధులకు డబ్బులు ముట్టజెప్పి మేనేజ్ చేసినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. బాధితులకు న్యాయం జరగాల్సి ఉండగా, మధ్యలో జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సెటిల్మెంట్ కుదిర్చి ఇరువైపులా వసూళ్లకు పాల్పడ్డాడనే విమర్శలు ఉన్నాయి.సెల్లార్ల పేరుతో బెదిరింపులు.. లక్షల్లో వసూళ్లు
అనుమతులు లేకుండా నిర్మించిన సెల్లార్ల వ్యవహారంలోనూ ఇదే తరహా దందా నడిపాడు. పట్టణంలో ఎక్కడ సెల్లార్ కనిపించినా వెంటనే అక్కడ వాలిపోతాడు. మున్సిపల్ అధికారులతో నోటీసులు ఇప్పించి, తనకు మీడియా సపోర్ట్ ఉందని, వార్తలు రాసి బిల్డింగ్ సీజ్ చేయిస్తానని బెదిరించి సదరు యజమానుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అధికారుల పేరు చెప్పి, మీడియాలో వార్తలు రాస్తానంటూ భయపెట్టి ఒక్కో బిల్డింగ్ యజమాని నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.నిరుపేదలపై జులుం
పట్టణంలోని పలు వార్డుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వేసుకునే రేకుల షెడ్లను కూడా వదలడం లేదు. ఎక్కడ షెడ్డు వేసినా వాలిపోయి, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే షెడ్లు కూల్చివేయిస్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇచ్చిన వారిని వదిలేసి, ఇవ్వని వారి షెడ్లపై ఫిర్యాదులు చేసి కూల్చివేయించే ప్రయత్నాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయిమున్సిపల్ సిబ్బంది అండదండలు..
ఈ వసూల్ రాజాకు మున్సిపల్ కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుందో ముందుగానే సమాచారం ఇస్తారని, ఆ సమాచారంతో వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఇంకా వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయని, బాధితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుటుంబ సభ్యుడు కావడంతో ఎవరూ నోరు మెదపలేకపోతున్నారని, అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెలుగులోకి రాని సెటిల్మెంట్లు ఎన్నో..
పైకి కనిపిస్తున్నవి కొన్ని కేసులే అయినా తెరచాటున జరిగిన సెటిల్మెంట్లు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భూ వివాదాలు, ఇంటి నిర్మాణ అనుమతులు, వ్యాపార సముదాయాల లైసెన్సుల విషయంలోనూ మధ్యవర్తిత్వం చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితులు భయంతో బయటకు రావడం లేదని, ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపితే అసలు దందా బయటపడుతుందని అంటున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వసూల్ రాజా ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.