🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 1:51 pm Posted by : TELANGANA KERATAM

మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ చే జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ బాలు

News Image
మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ చే జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ బాలు19 సంవత్సరాల నుండి రక్తదానంలో చేస్తున్న సేవలకు గుర్తింపు రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ పురస్కారం
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీ లో నిర్వహించిన జాతీయ సమావేశంలో శ్రీ రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ పురస్కారం 2026 నికి గాను ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు ఉత్తరప్రదేశ్ వృత్తి విద్యా, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్,డిల్లీ బిజెపి ఏంఎల్ఏ తిలక్ రామ్ గుప్త,మరియు ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్,ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,బిజెపి సీనియర్ నాయకులు శ్యామ్ జాజు ల ద్వారా అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి రక్తదాన కార్యక్రమాల ద్వారా 30 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం,తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తక్కువ సమయంలో 7000 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ పురస్కారం అందుకున్నట్లు తెలియజేశారు.ఈ ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారానికి ఎంపిక చేయడానికి ఎంతగానో సహకరించిన గంజి రాజమౌళి గుప్త,ఉప్పల శ్రీనివాస్ గుప్త, సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు అనీల్ అగర్వాల్,జాతీయ కోశాధికారి దినేశ్ చాంద్ గుప్త,ఐవిఎఫ్ సెంట్రల్ కమిటీ సభ్యులు కక్కిరాల రమేశ్,నీల భైరయ్య లు పాల్గొనడం జరిగింది.
🏠 Home