🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 2:37 pm Posted by : TELANGANA KERATAM

108 సిబ్బంది చొరవతో ఇంట్లోనే సుఖప్రసవం..తల్లీబిడ్డ క్షేమం!

News Image
ముఖ్యమైన పాయింట్స్:సమయస్ఫూర్తితో వ్యవహరించి న సీబ్బంది
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 1:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన షేక్ హసీనాకు మొదటి కాన్పు పురిటినొప్పులు ఇంటివద్దనే ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కమ్మర్‌పల్లి 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.అప్పటికే గర్భిణికి పురిటినొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని అంచనా వేసిన 108 ఈఎంటి సుంకరి విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్‌లు ఈ ఆర్ సి పి వైద్యులు డాక్టర్రా జశేఖర్సూచనలు,సలహాలమేరకుసమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటివద్దనేసురక్షితంగాసాధారణప్రసవంనిర్వహించారు. ఈ క్రమంలో హసీనా పండంటి ఆడబిడ్డకుజన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు అందించి, తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం కమ్మర్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి, వైద్యుల సూచనలతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఇంటివద్దనే సురక్షిత ప్రసవం చేసిన 108 సిబ్బంది ఈ ఎం టీ సుంకరి విజయ్ కుమార్, పైలట్ రాజశేఖర్‌లను కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home