🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 5:09 pm Posted by : TELANGANA KERATAM

ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కొండి రాజిరెడ్డి
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కొండి రాజిరెడ్డి దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 01, తెలంగాణ కెరటం:ఐదు వ్యవసాయ బావులకు రక్షణ గోడల నిర్మాణానికి రూ.31 లక్షల నిధులు మంజూరు చేసిన
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కొండి రాజిరెడ్డి దుబ్బాక నుంచి అప్పనపల్లి మీదుగా సిద్దిపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిపై అప్పనపల్లి, పెద్దగుండవెల్లి శివారులో రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న ఐదు వ్యవసాయ బావులకు రక్షణ కల్పించేందుకు గోడల నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ పనుల కోసం భద్రతా చర్యల్లో భాగంగా సుమారు రూ.31 లక్షల నిధులను మంజూరు చేయించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొండి రాజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి మరోసారి కొండి రాజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
🏠 Home