🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 6:17 pm Posted by : KUKKALA RAJU

నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.

News Image
ముఖ్యమైన పాయింట్స్:కాంగ్రెస్ పాలనలోనూ జరిగిన సమగ్ర సవరణలు.. ఇప్పుడు వ్యతిరేకత వెనుక కారణాలేమిటి.?ఓటరు జాబితాల ప్రక్షాళన'పై రాజకీయ రగడ.. అసలు వివాదం ఏమిటి.?ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వచ్ఛమైన ఓటరు జాబితాలు అవసరం.. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదు.!అచ్చునూరి కిషన్ ముదిరాజ్. MA.అనాలిస్ట్ -- విశ్లేషకుడుములుగు జిల్లా.ఫోన్: +91 9000986761.
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.

కాంగ్రెస్ పాలనలోనూ జరిగిన సమగ్ర సవరణలు.. ఇప్పుడు వ్యతిరేకత వెనుక కారణాలేమిటి.?

ఓటరు జాబితాల ప్రక్షాళన'పై రాజకీయ రగడ.. అసలు వివాదం ఏమిటి.?

ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వచ్ఛమైన ఓటరు జాబితాలు అవసరం.. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదు.!

ప్రత్యేక కథనం:

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు సక్రమంగా అమలుకావాలంటే ఓటరు జాబితాలు కూడా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండాలని, ఈ లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియే SIR (Special Intensive Revision). అయితే దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారిందని విశ్లేషకుల అభిప్రాయం.

కాంగ్రెస్ పాలనలోనూ SIR తరహా ప్రక్రియలు!

SIR అనేది బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదని, భారత ఎన్నికల సంఘం అధికారిక రికార్డుల ప్రకారం 1952–1956, 1957, 1961, 1965–66, 1983–84, 1987–89, 1992–95, 2002–04 మధ్య ఎనిమిది ప్రధాన దశల్లో సమగ్ర ఓటరు జాబితా సవరణలు నిర్వహించిందని, వీటిలో ఏడు దశలు కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాల కాలంలో జరిగాయని, చివరి దశ 2002–04లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పవచ్చును. అప్పట్లో ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన అవసరమని భావించి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహించడం జరిగింది. మరి గతంలో జరిగినప్పుడు ఇదే ప్రక్రియపై అభ్యంతరాలు ఎందుకు లేవని? ఇప్పుడు నిర్వహిస్తుంటే రాజకీయ వివాదాలు ఎందుకు పెరుగుతున్నాయని? అనేది ప్రజల్లో, రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చును.

SIR ఎందుకు అవసరం?

ఒక వ్యక్తి మరణించినప్పటికీ ఓటరు జాబితాలో పేరు కొనసాగితే, ఒకే వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదైతే, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినా పాత ప్రాంతంలో పేరు కొనసాగితే ఓటరు జాబితా విశ్వసనీయత దెబ్బతింటుందని, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు అందుబాటులో ఉండాలనేది సర్ ప్రధాన ఉద్దేశం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇంటింటి పరిశీలనతో ఓటరు వివరాలను ధ్రువీకరించడం SIR ప్రధాన ఉద్దేశమని, ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, వలసలు, మరణాలు, చిరునామాల మార్పులు పెరగడంతో ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన తక్షణ అవసరమైందని చెప్పకనే చెప్పవచ్చును.

*కాంగ్రెస్, ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏమిటి?*

సర్'ను కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అర్హులైన పౌరుల ఓటు హక్కుకు నష్టం కలగవచ్చనే ఆందోళన, ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, నిరక్షరాస్యులు అవసరమైన పత్రాలను సమర్పించలేకపోతే వారి పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, అలాగే ఎన్నికల సంఘం వ్యవహారశైలి, పౌరసత్వ అర్హతల పరిశీలన, ప్రక్రియలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయడం కూడా సరికాదని, అర్హులైన ఒక్క పౌరుడి ఓటు హక్కు కూడా పొరపాటున తొలగిపోకుండా తగిన రక్షణలు ఉండాలని, అదే సమయంలో అనర్హమైన నమోదులను కొనసాగించడం కూడా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధమే అని విశ్లేషకుల నుంచి వినబడుతున్న మాట.

*బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వ వాదన ఏమిటి.?*

కేంద్రంలో'ని బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం ఎస్.ఐ.అర్ ప్రక్రియకు మద్దతు తెలుపుతోంది, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు భారత పౌరులకు మాత్రమే ఉండాలని, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు వేయకుండా చూడాలని, మరణించిన వారి పేర్లు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని చెప్పవచ్చును. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన సమగ్ర ఓటరు జాబితా సవరణలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఇదే ప్రక్రియను వ్యతిరేకించడం ఎందుకని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. అయితే సర్ ను అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదని, రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘానిదే ప్రధాన బాధ్యత. కాబట్టి ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చును.

*సుప్రీంకోర్టు పరిశీలన.. రాజ్యాంగబద్ధతపై చర్చ!*

ఎస్.ఐ.ఆర్.పై న్యాయపరమైన చర్చ కూడా కొనసాగుతోంది. 2026 మే 27న సుప్రీంకోర్టు ఎస్.ఐ.అర్. నిర్వహణ ఎన్నికల సంఘం చట్టబద్ధ అధికార పరిధిలో ఉందని పేర్కొన్నట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించడం జరిగింది. మరోవైపు అమలు విధానం, పారదర్శకతకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై న్యాయపరమైన పరిశీలన కొనసాగుతోంది.

*రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం.!*

ఓటరు జాబితాల ప్రక్షాళన అనేది ఒక పార్టీకి అనుకూలం, మరో పార్టీకి వ్యతిరేకం అనే కోణంలో మాత్రమే చూడాల్సిన అంశం కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనూ జరిగిన ఈ ప్రక్రియను ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చడం వల్ల అసలు లక్ష్యం మరుగున పడకూడదని, ఎస్.ఐ.అర్. ద్వారా మరణించిన వారి పేర్లు తొలగాలి, నకిలీ, బహుళ నమోదులు సరిచేయాలి, అర్హులైన యువతకు ఓటు హక్కు కల్పించాలి, అదే సమయంలో ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, నిరుపేద కుటుంబాలకు చెందిన అర్హులైన భారతీయ పౌరుల పేర్లు ఎలాంటి పొరపాట్ల వల్లా తొలగిపోకూడదని, ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన ఓటరు జాబితా ఎంత అవసరమో, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడటం కూడా అంతే అవసరమని, రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు పరిమితం కాకుండా, ఎన్నికల సంఘం పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా సహకరించాలని, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అసలైన బలం రాజకీయ పార్టీలు కాదని, ప్రజల ఓటు హక్కని, ఆ ఓటు హక్కు'పై ఉండే విశ్వాసం అని విమర్శకులు గుర్తెరుగాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
🏠 Home