🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:15 pm Posted by : KUKKALA RAJU

చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య.

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 01,తెలంగాణ కెరటం:మతిస్థిమితం సరిగ్గా లేని యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద చీకోడు గ్రామానికి చెందిన హలీమాబి అనే వృద్ధురాలు కూలి పని చేస్తూ, కుటుంబంతో జీవనం సాగిస్తోంది. గత నెల 14వ తేదీన రెండవ కుమారుడు ఎండి రఫీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనితో ఆమె మూడవ కుమారుడు మతిస్థిమితం సరిగా లేని ఎండి ఫారుక్ (28) తీవ్రంగా బాధపడుతూ, అన్న మీద ప్రేమతో నేను కూడా అన్న వద్దకే పోతానంటూ అరిచేవాడు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన ఎండి ఫారుక్ దుబ్బాక పట్టణ శివారులో ద్విచక్రవాహనాన్ని చెట్టు వద్ద నిలిపి, చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఘటనను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.
🏠 Home