🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:25 pm Posted by : TELANGANA KERATAM

జగిత్యాలలో చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలి

News Image
📌 జెవివి రాష్ట్ర బాధ్యులు సిలివేరి సంపత్ కుమార్

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించాలితెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 : విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించి, విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నరేందర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌తో పాటు సైన్స్ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా శక్తి పెంపొందించడమే చెకుముకి సైన్స్ సంబరాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీ ఎన్నిక అనంతరం నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తులసి ఆగమయ్య,
ఉపాధ్యక్షుడుగా ఏ.రవి, ప్రధాన కార్యదర్శిగా బడే శ్రీనివాస్, కార్యదర్శులుగా గజ్జెల జానకిరామ్, నాగన్న, కోశాధికారిగా మొదులకర్ నవీన్ లు ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు పి.మహేంద్ర ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.
🏠 Home