🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 9:48 pm Posted by : TELANGANA KERATAM

అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దు!

News Image
అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దు!ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదు..మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్..,,,,,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 1, నవంబర్ఢిల్లీ రాంలీలా మైదాన్, తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలలో పాల్గొన్న నీలం..
ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఓట్ బచావో - దేశ్ బచావో కార్యక్రమానికి హాజరు..
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈరోజు నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఓట్ బచావో.. దేశ్ బచావో' భారీ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగించే పరిస్థితులకు బీజేపీ పాలకులు కారణమవుతున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకూడదని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్యుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అలాంటి ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే హక్కును ప్రశ్నార్థకం చేసే ఎలాంటి చర్యలైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
దేశంలో ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పోరాడుతుందని హెచ్చరించారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అండగా నిలవాలని నీలం మధు కోరారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యమే దేశానికి అసలైన బలమని పేర్కొంటూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
🏠 Home