🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 8:46 pm Posted by : TELANGANA KERATAM

ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి

News Image
70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2:



నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 70వ అండర్-14, అండర్-17 (బాలబాలికల) మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పాఠశాలకు జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువు, విజ్ఞానం ఎంత కీలకమో, వారి శారీరక దృఢత్వం మరియు మానసిక స్థిరత్వానికి ఆటలు కూడా అంతే ప్రధానమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో క్రీడా సంస్కృతిని విస్తరింపజేయాలన్నదే తన ఆకాంక్ష అని, అందువల్లే నియోజకవర్గవ్యాప్తంగా క్రీడా పోటీల నిర్వహణను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేయకుండా, స్థానిక పాఠశాల మైదానాలకు పంపి వారికి ఇష్టమైన ఆటలను ఆడుకునేలా స్వేచ్ఛనివ్వాలని సూచించారు.నియోజకవర్గంలో స్కూల్ గేమ్స్ టోర్నమెంట్లు అంగరంగ వైభవంగా జరుగుతుండటం వెనుక వ్యాయామ ఉపాధ్యాయుల శ్రమ వెలకట్టలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు. సొంత ఇంటి శుభకార్యంలా భావించి, ఎలాంటి అదనపు లబ్ధి ఆశించకుండా రాత్రీపగలు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్న పీఈటీలకు,ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందాలకు ఆయన చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రీడా సంబరాల విజయవంతమైన క్రెడిట్ అంతా పీఈటీలకే దక్కుతుందన్నారు.విద్యాసంస్థల బలోపేతానికి దాతలు ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొంటూ, తన వియ్యంకుడు దయానంద్ రెడ్డి సేవాగుణాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. బషీరాబాద్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్లు, డెస్క్ బెంచీల ఏర్పాటు కోసం దయానంద్ రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఎమ్మెల్యే అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఇలాంటి సహాయ సహకారాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ఈ మూడు రోజుల క్రీడా పోటీలకు మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన నిత్యావసర సరుకులు, వంట ఖర్చులను సొంత నిధులతో సమకూర్చి, వరుసగా రెండో ఏడాది కూడా ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన స్థానిక దాత ఔదార్యాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బషీరాబాద్‌లో పండుగ వాతావరణంలో పోటీలను విజయవంతం చేస్తున్న 400 మంది గ్రామ యువతకు, గ్రామ అభివృద్ధి కమిటీ స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులకు, నిర్వహణ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఆటలన్నాక గెలుపోటములు సహజమని, టోర్నమెంట్‌లో ఓడిపోయిన క్రీడాకారులు నిరాశ చెందకుండా మరింత సాధన చేసిభవిష్యత్తులోగెలుపొందేందుకు పట్టుదల పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విజయం సాధించిన వారు గర్వానికి లోనుకాకుండా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home