🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:52 am Posted by : TELANGANA KERATAM

డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే…..

News Image
డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే…..అధికారులు, ఎంకేపల్లి గ్రామస్థుల తో కలిసి డంప్ యార్డ్ ను సందర్శించిన చింతా ప్రభాకర్.తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్ గ్రామస్థుల గోసను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీపావళి పండగ లోపు గ్రామస్తుల సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించడం జరిగింది. 
 మున్సిపల్ అధికారుల నిర్వహణ లోపం వల్ల చెత్త రోడ్లపై పేరుకోవటం కుక్కల స్వైర విహారం పెరగటం గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం గుండా పందులు పశువుల స్వైర విహారం.
 కుక్కల స్వైరవిహారం తో విద్యార్థులు, మహిళలు, పాదచారులు అందరూ భయాందోళన చెందుతున్నారు. చెత్త రోడ్ల పైకి రాకుండా డంపు యార్డ్ లో మాత్రమే వేయాలని అధికారులను ఆదేశించారు.వర్షపు నీరు కలుషితమై దగ్గరిలోని రెండు చెరువులలో విధ్వంసం జరుగుతోంది. మత్స్యకారులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. . ఈ రెండు చెరువులు కూడా గంగకత్వ కాలువకు టెయిల్ ఎండ్ పాండ్స్. కలుషిత జలాలు చెరువుల్లో కలవకుండా పనులు చేపట్టాలని సూచించారు. 
ఇదే కాకుండా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశించారు.
తరచూ యాక్సిడెంట్స్ జరుగుతుండటం తో , ఎంకేపల్లి చౌరస్తా లో లైట్స్ ఏర్పాటు చేయాలని మునిసిపల్ అధికారులకు తెలిపారు.
 ఈ కార్యక్రమం లో ఇంకేపల్లి గ్రామ యువత, మాజీ సర్పంచ్లు రాములు, శేఖర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.  ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి కోడూరి రమేష్ , మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి , ఆత్మకూరు అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, మండల నాయకులు పాల్గొన్నారు .
🏠 Home