🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:58 am Posted by : TELANGANA KERATAM

17 ఏళ్లుగా పూర్తికాని రైల్వే బ్రిడ్జి పనులు.. ఘట్‌కేసర్ బంద్ విజయవంతం

News Image
*17 ఏళ్లుగా పూర్తికాని రైల్వే బ్రిడ్జి పనులు.. ఘట్‌కేసర్ బంద్ విజయవంతం*
*అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐక్యంగా నిరసన..* 
*స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు*
*– బ్రిడ్జి నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని నాయకుల డిమాండ్*
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 2 : ఘట్‌కేసర్ మండలంలో గత 17 సంవత్సరాలుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఘట్‌కేసర్ బంద్ నిర్వహించారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అఖిలపక్ష నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పార్టీలకతీతంగా ఐక్యంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అఖిలపక్షం పిలుపునకు వ్యాపారులు, దుకాణదారులు స్వచ్ఛందంగా స్పందించి తమ దుకాణాలను మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఘట్‌కేసర్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కనిపించింది. ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు వ్యాపార సంస్థల యజమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు, రైల్వే బ్రిడ్జి నిర్మాణ జాప్యం కారణంగా నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు, సంబంధిత అధికారులు 17 సంవత్సరాలుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ప్రజలు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు ఇకనైనా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులను మరింత కాలం వాయిదా వేయకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
🏠 Home