🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 7:00 am Posted by : TELANGANA KERATAM

డిసెంబర్ చివరి నాటికి ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు పూర్తి

News Image
డిసెంబర్ చివరి నాటికి ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు పూర్తి
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 3: అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైల్వే వంతెన కాంట్రాక్టర్ సత్తిరెడ్డి మంగళవారం ఉదయం అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిసెంబర్ 2026 చివరి నాటికి వంతెన పనులు పూర్తి చేసి, జనవరి 26, 2027న ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే బంద్‌కు సహకరించిన ఘట్‌కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్‌తో పాటు చర్చలకు వచ్చిన కాంట్రాక్టర్ సత్తిరెడ్డికి అఖిలపక్ష నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home