🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 7:05 am Posted by : TELANGANA KERATAM

ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....

News Image
*ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....*తెలంగాణ, కెరటం, స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్*కాలనీలో రోడ్ల పరిశీలన, నూతన సిసి రోడ్ల నిర్మాణం కొరకు అంచనా వ్యయం వేయాల్సిందిగా జిహెచ్ఎంసి అధికారులను కోరిన మెట్టు కుమార్ యాదవ్.....*
*బండ్లగూడ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని పరిశీలించిన మెట్టు కుమార్ యాదవ్.....**ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం....*

* *ఎన్ ఆర్ పి కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు:*    *ఎన్ ఆర్ పి కాలనీలో పర్యటించిన మెట్టు కుమార్ యాదవ్ కాలనీలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అంచనా వ్యయాన్ని సిద్ధం చేయాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.*
*అనంతరం జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలో ఇంటిపైన పడిన శటిల్ కాక్ తీసేందుకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన విషయం తెలిసిన మెట్టు కుమార్ యాదవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువకుడి హఠాన్మరణం గురించి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.*
🏠 Home