అనారోగ్యంతో భర్త ఇంటి ముందు బాధితురాలి బైఠాయింపు
వేధింపులు తాళలేక న్యాయం కోసం కన్నీటి పోరాటం రెండో పెళ్లి చేసుకుంటానంటున్న ఎన్నారై భర్త
పోలీసులు న్యాయం చేయాలని మహిళా సంఘాల డిమాండ్తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 04 : అత్తింటి వేధింపులు తాళలేక, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ వివాహిత న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే బైఠాయించిన ఘటన కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. కోరుట్ల పట్టణం బుక్కవాడలోని భర్త గట్ల రాజేశ్ ఇంటి ఎదుట బాధితురాలు రచన, ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన రచనకు, కోరుట్లకు చెందిన గట్ల రాజేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అత్తమామల వేధింపులు తీవ్రమయ్యాయి. వారి మానసిక క్షోభను భరించలేక గతంలోనే రచన ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం రచన తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, ఆమెను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా అత్తమామలు అడ్డుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్న భర్త రాజేశ్.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న భార్యను ఆదుకోవాల్సింది పోయి, తాను మరో పెళ్లి చేసుకుంటానని నిర్లక్ష్యంగా తెగేసి చెబుతున్నాడని రచన కన్నీటిపర్యంతమైంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు న్యాయం కోసం వస్తున్నారన్న సమాచారంతో అత్తమామలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో చేసేదేమీ లేక తాళం వేసిన ఇంటి ముందే బాధితురాలు బైఠాయించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రచనను అత్తింటికి చేర్చుకుని, సంసార బాధ్యతలను స్వీకరించి న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేసి, వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.