🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 8:15 pm Posted by : TELANGANA KERATAM

పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామి కి చిరు సన్మానం

News Image
 పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గడ్డం స్వామి కి చిరు సన్మానం


దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 04, తెలంగాణ కెరటం:సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సిద్దిపేట జిల్లా టి డబ్ల్యూ జే ఎఫ్, సహాయ కార్యదర్శి గా మిరుదొడ్డి గ్రామ పద్మశాలి సమాజం సభ్యులు జర్నలిస్ట్ గడ్డం స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు గ్రామ పద్మశాలి సమాజం స్వామి ని శాలువాతో చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ.. పద్మశాలి సమాజం సభ్యులు గడ్డం స్వామి జిల్లా స్థాయికి ఎదగడం చాలా సంతోషకరంగా ఉన్నదని అదేవిధంగా పద్మశాలి సమాజం అన్ని విధాలలో అంచలంచలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పద్మశాలి సంఘ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, ఉపఅధ్యక్షులు గడ్డం స్వామి, సుతారి రమేష్, ప్రధాన కార్యదర్శి గడ్డం ఆంజనేయులు, కోశాధికారి గడ్డం శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు గడ్డం విట్టల్, సలహాదారులు రాపల్లి రాజేశం, గడ్డం మహదేవ్, మరియు సంఘ సభ్యులు, రాపల్లి నర్సింలు, సుతారి కిష్టయ్య, పెద్ది అశోక్, కొండ శ్రీనివాస్,బట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home