🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 7:51 am Posted by : TELANGANA KERATAM

ఖేలో ఇండియా కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు

News Image
ఖేలో ఇండియా కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 4:
డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో నిర్వహించబోయే ఖేలో ఇండియా టోర్నమెంట్ కబడ్డీ కోసం జిల్లాకు చెందిన ఇద్దరు కబడ్డీ క్రీడాకారిణులు ఖేలో ఇండియా కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారాని నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన సిరివెన్నెల, గౌతమి ఈ నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో నిర్వహించనున్న ఖేలో ఇండియా కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినిలు ఇందల్ వాయి మండల కేంద్రంలో ని టీజీ టీడబ్ల్యూఆర్జేసీ బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంవిద్యనభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు.
🏠 Home