🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 7:59 am Posted by : TELANGANA KERATAM

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం

News Image
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానంతెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 4, నవంబర్నేరడిగుంట గ్రామం: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు ప్రణయ్ మరియు మనసలను నేడు ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలోని యువత క్రీడా రంగంలో మరింత ముందుకు సాగి ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రణయ్, మనసలు అత్యుత్తమ ప్రతిభ కనబరచి గ్రామానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ప్రోత్సహించారు.
అదేవిధంగా, రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిస్తే ఇద్దరు క్రీడాకారులకు తలా రూ.10,000 చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేస్తానని ప్రకటించారు. గ్రామంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, యువతకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్ గారు, వార్డు సభ్యులు బోయిని శంకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home