ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వ కలుసుకున్న కొత్తూరు ట్రాఫిక్ సిఐ ఉపేందర్
*నూతన ట్రాఫిక్ సీఐ ఉపేందర్‌కు ఎమ్మెల్యే శంకర్ సూచనలు
*కొత్తూరు నవంబర్ 04 ( తెలంగాణ కెరటం)* కొత్తూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ ఉపేందర్ బుధవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాఫిక్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.