🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 6:52 am Posted by : TELANGANA KERATAM

అనంతసాగర్‌లో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

News Image
అనంతసాగర్‌లో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 5, నవంబర్ సంగారెడ్డి జిల్లా అనంతసాగర్ గ్రామంలో కుమార్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుమార్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామ సర్పంచ్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక పరిస్థితులపై నాయకులు పరస్పరం చర్చించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home