🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:08 am Posted by : TELANGANA KERATAM

పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు

News Image
పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు
 ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలి
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 5
పర్సాపూర్ ‘ఖేతీ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పర్సాపూర్ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోస్గి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) నూతన్ కుమార్ మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ఎల్ నినో ప్రభావంపై రైతులకు వివరించారు.పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో నేల సారవంతత పెరగడంతో పాటు సేంద్రియ పదార్థాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలని కోరారు.యాసంగి సీజన్‌లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాతారి అంజిలమ్మ, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, వ్యవసాయ విస్తరణాధికారి శివజ్యోతి, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు....
🏠 Home