🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:32 am Posted by : TELANGANA KERATAM

ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

News Image
ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 
-దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 
దుబ్బాక ప్రతినిధి, నవంబర్05, తెలంగాణ కెరటం :నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ని గురువారం రోజున దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సన్న ధాన్యానికి బోనస్ తో పాటు, దొడ్డు ధాన్యానికి నిర్ణీత మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేన్నం రాజేందర్ రెడ్డి, టిపిసిసి సేవాదళ్ ఐ ఇరప్ప యాదగిరి యాదవ్, డిసిసి జనరల్ సెక్రెటరీ బక్కన్న గారి సంపత్ రెడ్డి, నర్సంపల్లి గ్రామ సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మగారి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎండీ . అన్వర్,ఆకుల నరేష్, బాచి, జానీ, శ్రీధర్ రెడ్డి, అంచనూరి రాజేష్, సుధాకర్ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home