🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:34 am Posted by : TELANGANA KERATAM

ఎల్ నినో నేపథ్యంలో ఎండిపోయిన పంటల నమోదు.

News Image
 వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్
దుబ్బాక ప్రతినిధి, నవంబర్05,తెలంగాణ కెరటం :దుబ్బాక మండలం గంభీర్ పూర్, పోతారం గ్రామాలలో ఎల్ నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు మండలం లో ఎండిపోయిన పంటల నమోదు ను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. వరి కంది మొదలగు పంటలు భూగర్భ జలాలు తగ్గి, కొన్ని బోర్లు ఎండిపోవటం, విద్యుత్ సరఫరా లో ఇబ్బందులతో కొన్ని గ్రామాలలో వరి పంట ఎండిపోవటం గమనించటం జరిగింది అన్నారు.వాటిని జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు అందరు ఏఈఓ లు పంట పొలాలు సందర్శించి సంబందించిన ఆప్ లో రైతుల వివరాలు నమోదు చేయటం జరుగుతుందన్నారు. కావున ప్రజా ప్రతినిధులు, రైతులు గ్రామాలలో ఏఈఓ లను సంప్రదించి ఎండిపోయిన పంటలను నమోదు చేసుకోగలరు అని తెలిపారు. పంటల పర్యవేక్షణలో ఏఈఓ సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు బాణాల శ్రీనివాస్, మల్లేశం,కృష్ణాగౌడ్, వినీత్, కాశి, మల్లవ్వ పలువురు పాల్గొన్నారు.
🏠 Home