🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:40 am Posted by : TELANGANA KERATAM

దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

News Image
దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స  
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 05,తెలంగాణ కెరటం :సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం. ఒకే శస్త్రచికిత్సలో తల్లికి ప్రసవం, గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన 34 సంవత్సరాల స్వప్న అనే గర్భిణి ప్రతి నెల దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చారు. ఆమెకు నిర్వహించిన స్కానింగ్‌లో గర్భంతో పాటు గర్భాశయంలోని ముందు భాగంలో 2 కిలోల 200 గ్రాముల పరిమాణంలో రక్తప్రసరణ కలిగిన ఫైబ్రాయిడ్ గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పుట్టిన బిడ్డ బరువు 3 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ క్లిష్టమైన కేసును సవాలుగా స్వీకరించిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించింది. ఒకే ఆపరేషన్ ద్వారా సిజేరియన్ ప్రసవం నిర్వహించడంతో పాటు గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్ గడ్డను కూడా తొలగించారు.ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో తల్లి స్వప్నతో పాటు పుట్టిన బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.ఈ విజయవంతమైన వైద్య సేవల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్" హేమరాజ్ సింగ్, గైనకాలజిస్ట్ డాక్టర్" శ్రావంతి, మత్తు డాక్టర్" ప్రేమ్ కిషోర్ మరియు ఆసుపత్రి సిబ్బంది కీలక పాత్ర పోషించారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని మరింత పెంచేలా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం అందించిన ఈ సేవలు అభినందనీయం అన్నారు.పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తూ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల మన్ననలు పొందుతోంది అన్నారు.ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని వైద్యుల అంకితభావానికి, నైపుణ్యానికి, సేవా స్ఫూర్తికి ఈ సంఘటన ఒక చక్కని నిదర్శనం అన్నారు.
🏠 Home